హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
రోడ్ల పై వాహనదారుల్లో బాధ్యత,
క్రమశిక్షణను పెంచేందుకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సరికొత్త ఐడియాతో సోమవారం ముందుకు వచ్చారు. సేఫ్ రైడ్ ఛాలెంజ్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ సేఫ్ రైడ్ ఛాలెంజ్ కింద ఇంటి నుంచి ప్రయాణం అయ్యే ముందు వాహనదారుడు హెల్మెట్ ధరించడం, కారు సీటు బెల్టు ధరించిన ఫొటో లేదా వీడియోను తీసుకుని వాటిని ముగ్గురు స్నేహితులు, లేదా కుటుంబ సభ్యులకు షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టును పోలీసు కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది మండే ట్రెడింగ్గా మారింది. ఇలా ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ను స్వీకరించి వారే స్వయంగా రోడ్డు భద్రత పై ప్రచారం చేయడం ద్వారా రోడ్ల పై సురక్షితమైన వాతావరణం నెలకొంటుందని సీపీ భావిస్తున్నారు. ఈ ఛాలెంజ్ను హైదరాబాద్ పోలీసులు కూడా వారి సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..