హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రసాయన డ్రమ్ములు దాచిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశ్వసనీయ వ్యక్తుల ఫిర్యాదు మేరకు నార్కోటిక్ అధికారులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు జరిపారు. గోదాంలో ఓ పరిశ్రమకు చెందిన రసాయన పౌడర్, డ్రమ్ములు పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు గుర్తించారు. రాంకి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలించాల్సిన ప్రమాదకర రసాయనాలు ఫంక్షన్ హాల్లో దాచినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..