హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్
కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో విరాట్ కోహ్లి ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడేందుకు అగ్రిమెంట్ పై విరాట్ కోహ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ అగ్రిమెంటుపై ఇప్పటివరకు విరాట్ కోహ్లి సంతకం చేయలేదని తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, విరాట్ కోహ్లికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
అయితే వాళ్లకు విరాట్ కోహ్లి అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఫోన్ కూడా ఎత్తడం లేదట. దీంతో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని విరాట్ కోహ్లిపై వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత వన్డేలతో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..