కర్నూలు,: 13 అక్టోబర్ (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గోనెగొండ్ల మండలం వైసీపీ మండల ఉపాధ్యక్షులు రమణి కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అధికార కూటమి పథకాలకు ఆకర్షతులై తన అనుచరులతో కలిసి మండల ఉపాధ్యక్షులు రమణ కుమారి టీడీపీ పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ