వ్యవసాయరంగం బలోపేతం కోసమే ప్రధాని కృషి : ఎంపీ డీకే అరుణ.
జోగులాంబ గద్వాల, 13 అక్టోబర్ (హి.స.) ప్రధాని ధన, ధాన్య కృషి యోజన పథకం ద్వారా సంవత్సరానికి 960 కోట్ల నిధులతో, ఆరు సంవత్సరాలకుగాను 42 వేలకోట్ల బడ్జెట్ తో దేశంలో వున్న 100 జిల్లాలో ఈ పథకం అములులో ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలో ఈ పథకం
ఎంపీ డీకే అరుణ


జోగులాంబ గద్వాల, 13 అక్టోబర్ (హి.స.)

ప్రధాని ధన, ధాన్య కృషి యోజన పథకం ద్వారా సంవత్సరానికి 960 కోట్ల నిధులతో, ఆరు సంవత్సరాలకుగాను 42 వేలకోట్ల బడ్జెట్ తో దేశంలో వున్న 100 జిల్లాలో ఈ పథకం అములులో ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలో ఈ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చోహన్ కొత్త పథకానికి రూపకల్పన చేశారని, ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుభంద రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ పథకం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా లో వెనుకబడిన ప్రాంతాలలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకా వ్యవసాయ ఉత్పత్తులను పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ పథకం రూపుదిద్దుకొన్నాదని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande