న్యూయార్క్ తెలంగాణ జానపద పండగ.. ఆటపాటలతో ఉర్రూతలూగించిన సింగర్స్
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా(న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్తో కార్యక్రమాలు ఈ వీకెండ్లో నిర్వహించారు. పెద్
న్యూయార్క్ తెలంగాణ


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా(న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్తో కార్యక్రమాలు ఈ వీకెండ్లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. 'ధూమ్ ధామ్' వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande