నోబెల్ మిస్ అయింది.. మరో అవార్డు వరించింది..
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) నోబెల్ రాలేదనే బాధలో ఉన్న ట్రంప్నకు మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిం
ట్రంప్


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

నోబెల్ రాలేదనే బాధలో ఉన్న ట్రంప్నకు మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్'ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ ప్రకటించారు. బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోవడానికి ట్రంప్ అర్హుడని ఇజ్రాయెల్ అధ్యక్షుడు పేర్కొన్నారు. అవార్డు ప్రకటనపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande