సంగారెడ్డి, 13 అక్టోబర్ (హి.స.)
పోలీసు అమరవీరుల దినోత్సవం,
పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ వివరించారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో, 6వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు పాల్గొనడానికి ఉంటుందన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర అనే అంశంపై విద్యార్థులు తమ వ్యాసాలను రాసి, అక్టోబర్ 31 వ తేదీలోగా ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు ఇవ్వడంతో పాటు, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఎస్పీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు