ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కే.హైమావతి
సిద్దిపేట, 13 అక్టోబర్ (హి.స.) మన చుట్టూ ఉన్న పరిసరాలు శుబ్రంగా లేక నీటి నిల్వ వలన దోమలు పెరిగి కుట్టడం వల్ల డెంగ్యూ బారిన గురి అవుతారని ముందు మన పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. సోమవారం మండల కేంద్రం
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 13 అక్టోబర్ (హి.స.)

మన చుట్టూ ఉన్న పరిసరాలు శుబ్రంగా లేక నీటి నిల్వ వలన దోమలు పెరిగి కుట్టడం వల్ల డెంగ్యూ బారిన గురి అవుతారని ముందు మన పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. మలేరియా డెంగ్యూ కేసులపైన ఆరా తీశారు. అటెండెన్స్ ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. అటెండర్ విధులకు రాలేదని కలెక్టర్ ప్రశ్నించగా మెడిసిన్ కోసం వెళ్ళాడని తెలిపారు.

మెడిసిన్ సప్లై పిఎచ్ సి కి అందేలా చర్యలు తీసుకోవాలని డి అండ్ హెచ్ ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే కావలసిన మెడిసిన్ ఒక నెల ముందే ఇండెంట్ పెట్టాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande