హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా.. రాంచందర్ రావు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో నా ప్రయాణం ప్రజా సేవ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, నా ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి కార్యకర్త, నాయకుడు, మద్దతుదారులు, అభిమానులు, ప్రజా దేవుళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై, కార్యకర్తల ఉత్సాహాన్ని, ప్రజల ఆశలను BJP దిశగా మలిచే ప్రయత్నం చేశాను.
పార్టీ సిద్ధాంతం - “సేవే లక్ష్యం” అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేశాను. రానున్న రోజుల్లో మరింత బలంగా, మరింత ప్రజా ఆధారంగా BJPని ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లడం నా ప్రధాన సంకల్పం. ప్రజల హక్కు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యం. ప్రతి దశలో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ.. ధన్యవాదాలు తెలుపుతున్నానను అంటే బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు