రాజన్న సిరిసిల్ల, 14 అక్టోబర్ (హి.స.)
ఏసీబీ వలకు సిరిసిల్ల సర్వేయర్ చిక్కాడు. బాధితుడి వద్ద రూ.20 వేలు తీసుకుంటుడగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ అర్బన్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ఓ రైతుకు చెందిన 3 ఎకరాల భూమిలో సర్వే కోసం సిరిసిల్ల ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న వేణు రూ.30 వేలు డబ్బులు డిమాండ్ చేయాగా, మొదటగా 10 వేలు... సర్వే పూర్తయినా తర్వాత మరో 20 వేలు తీసుకుంటుండగా వేణును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు