శ్రీకాకుళం జిల్లా, 16 అక్టోబర్ (హి.స.)
నరసన్నపేటలో బుధవారం రాత్రి శిథిల భవనం కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నందన్న ఉత్సవాల్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. అయితే డీజే శబ్ద తాకిడికి శిథిల భవనం ముందువైపు కూలింది. ఈ ఘటనలో బండి సంతోష్, పూర్ణ, రాధ చిరంజీవి, బాలకృష్ణ, అమృత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన నరసన్నపేటలోని పలు ఆసుపత్రులకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ