దీపావళి పండుగ సందర్భంగా రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) దక్షిణ మధ్య రైల్వే రాబోయే దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో, రైళ్లలో మరియు రైల్వే ప్రాంగణాలలో బాణసంచా/మండే స్వభావం గల వస్తువులను వెంట తీసుకుని వెళ్ళడాన్ని నిరోధించడానికి తనిఖీలు చేపడుతోంది. రైళ్లలో లేదా స్టేషన్ల
Vande Bharat train


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

దక్షిణ మధ్య రైల్వే రాబోయే దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో, రైళ్లలో మరియు రైల్వే ప్రాంగణాలలో బాణసంచా/మండే స్వభావం గల వస్తువులను వెంట తీసుకుని వెళ్ళడాన్ని నిరోధించడానికి తనిఖీలు చేపడుతోంది. రైళ్లలో లేదా స్టేషన్లలో అటువంటి వస్తువులను తీసుకెళ్లడం వలన భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది మరియు ఇది చుట్టుపక్కల ఉన్న ప్రయాణీకులందరికీ అత్యంత అసురక్షిత పరిస్థితిని సృష్టిస్తుంది.

రైలు ప్రయాణికులు, ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తులకు హాని కలిగించే మండే స్వభావం గల వస్తువులు / పేలుడు పదార్థాలు / బాణసంచాలను రైళ్లలో తీసుకెళ్లకూడదని సూచించడమైనది. రైలులో మండే మరియు పేలుడు స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 164 మరియు 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించదగిన నేరం.

దక్షిణ మధ్య రైల్వే భద్రత దృష్ట్యా మరియు రైళ్లలో బాణసంచా లేదా ఇతర మండే పదార్థాలను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో బాణసంచా లేదా ఇతర పేలుడు/మండే స్వభావం గల వస్తువులను లగేజీ/పార్శిల్‌గా తీసుకెళ్లవద్దని మరియు రైల్వేలతో సహకరించాలని రైలు వినియోగదారులందరిని హెచ్చరిస్తోంది. ప్రజా భద్రత దృష్ట్యా, రైళ్లలో లేదా స్టేషన్లలో బాణసంచా లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద / ప్రమాదకరమైన పేలుడు / స్వభావం గల పదార్థాలను గమనించినట్లయితే, రైల్వే వారు అవసరమైన చర్యలను తీసుకునే నిమిత్తం వెంటనే సమీపంలోని రైల్వే సిబ్బందికి తెలియజేయవచ్చు లేదా ¬భద్రతా హెల్ప్‌లైన్ -139 కాల్‌ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది.

దక్షిణ మధ్య రైల్వే రైళ్ళలో ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఇబ్బంది లేని రైలు ప్రయాణాన్ని నిర్ధారించడానికి రైలు ప్రయాణీకుల సహకారాన్ని కోరుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande