మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలి : రాంచందర్ రావు
మంచిర్యాల, 14 అక్టోబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మధుకర్ స్వగ్రామం నీల్వాయిలో ఆయన కుటుంబాన్ని పరామ
రామచంద్రరావు


మంచిర్యాల, 14 అక్టోబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మధుకర్ స్వగ్రామం నీల్వాయిలో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మధుకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా బీజేపీ ఆదుకుంటుందని, మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎన్ఐఆర్ కాపీలో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande