కాలుష్య రహిత వాతావరనానికి నేడ్క్యాప్ ఒక కార్యక్రమం చేపట్టింది
మదనపల్లె, 14 అక్టోబర్ (హి.స.), : కాలుష్య రహిత వాతావరణానికి నెడ్‌క్యాప్‌ ఒక కార్యక్రమం చేపట్టింది. కట్టెలు వినియోగించకుండా సూర్యరశ్మి ద్వారా వంటలు చేసుకునేలా ప్రోత్సహించింది. ఇందుకుగాను కురబలకోట మండలం బైసానివారిపల్లెను ఎంపిక చేసి అమలు చేసింది. తద్వ
కాలుష్య రహిత వాతావరనానికి నేడ్క్యాప్ ఒక కార్యక్రమం చేపట్టింది


మదనపల్లె, 14 అక్టోబర్ (హి.స.), : కాలుష్య రహిత వాతావరణానికి నెడ్‌క్యాప్‌ ఒక కార్యక్రమం చేపట్టింది. కట్టెలు వినియోగించకుండా సూర్యరశ్మి ద్వారా వంటలు చేసుకునేలా ప్రోత్సహించింది. ఇందుకుగాను కురబలకోట మండలం బైసానివారిపల్లెను ఎంపిక చేసి అమలు చేసింది. తద్వారా పొగ లేని ఊరుగా గుర్తింపు పొందింది.

ఆ గ్రామంలోని 35 కుటుంబాలకు సూర్యరశ్మి ద్వారా వంట చేసుకునే గొడుగులను అధికారులు అందజేశారు. గొడుగు మధ్యలో వంట పాత్రలు ఉంచడానికి వీలుగా ఇనుప చువ్వలు ఉంటాయి. ఎండ వచ్చినప్పుడు గొడుగును సూర్యునికి ఎదురుగా ఉంచి వంటపాత్రను ఇనుప చువ్వలపై పెడితే ఉడుకుంది. ఇందుకు 25 నిమిషాల సమయం పడుతుంది. పిండి, చిరుధాన్యాలతో చేసే వంటలు, వేరుసెనగ కాయలు, ఉలవలు ఉడికించడం వంటివి కూడా ఈ పొయ్యి పైనే గ్రామస్థులు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande