జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరు ..? కొనసాగుతున్న సస్పెన్స్..
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయగా సోమవారం మొదటి రోజు పది నామినేషన్లు సైతం దాఖలయ్యాయి. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్
జూబ్లీహిల్స్ బిజెపి


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయగా సోమవారం మొదటి రోజు పది నామినేషన్లు సైతం దాఖలయ్యాయి. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర పార్టీ ఇప్పటికే పార్టీ ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపగా పార్టీ బలమైన బీసీ అభ్యర్థి పేరును పరిశీలిస్తోంది. దీంతో అనూహ్యంగా మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ తనయుడు, యువనేత మూల విక్రమ్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. మరి పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande