జూబ్లీహిల్స్ బై పోల్ బిగ్ అప్డేట్.. మాగంటి సునీతపై కేసు నమోదు
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత , కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవ
జూబ్లీహిల్స్ బై పోల్


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత , కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయాంటూ ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఫిర్యాదు చేశారు. నేపథ్యంలోనే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC)ను ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని A1గా మాగంటి సునీత, A2 మాగంటి అక్షర, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande