హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ
ఉపఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST-11B) పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించింది. మైత్రీవనం ఎక్స్రోడ్స్, సారథి స్టూడియో సమీపంలో జరిగిన వాహన తనిఖీల సమయంలో అక్రమంగా తీసుకెళ్తున్న రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల సమయంలో TS09FF 6111 నెంబర్ గల కారును ఆపి పరిశీలించగా అందులో భారీగా నగదు దొరికింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీ జైరాం తలాసియాగా గుర్తించారు. సమాచారం ప్రకారం జైరాం తలాసియా ఈ నగదును తన కారులో యూసుఫ్గూడ వైపు తీసుకెళ్తున్న సమయంలో తనిఖీలు జరిపిన SST బృందం ఆయనను నిలిపివేసింది.
SST బృందం తక్షణమే నగదును స్వాధీనం చేసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓకి అప్పగించింది. ప్రస్తుతం పోలీసులు నగదు ఎవరిది, ఎవరికి ఇవ్వబోతున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు