హైదరాబాదు నగరం లో దారుణం చోటుచేసుకుంది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌: 14 అక్టోబర్ (హి.స.) నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి మహిళ ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్‌ పీఎస్‌ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు ను
హైదరాబాదు నగరం లో దారుణం చోటుచేసుకుంది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య


హైదరాబాద్‌: 14 అక్టోబర్ (హి.స.) నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి మహిళ ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్‌ పీఎస్‌ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయిలక్ష్మి స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడుగా గుర్తించారు. దంపతుల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande