కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం.ఊరట
అమరావతి, 14 అక్టోబర్ (హి.స.) అమరావతి: కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను రైతులకు తిరిగివ్వాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కాకినాడ సెజ్‌లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ర
కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం.ఊరట


అమరావతి, 14 అక్టోబర్ (హి.స.)

అమరావతి: కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను రైతులకు తిరిగివ్వాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కాకినాడ సెజ్‌లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్‌లకు రిజిస్ట్రేషన్‌, స్టాంప్ డ్యూటీ వసూలు చేయకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సందర్భంలో కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande