మెదక్, 14 అక్టోబర్ (హి.స.)
పేకాట జూదం ఆడుతున్నారనే పక్కా
సమాచారంతో దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్పెట్లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్కి తరలించడం జరిగిందన్నారు. ఈ దాడిలో మొత్తం 12 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.14,049/- నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు