సోదరి సునీతమ్మను చూస్తుంటే జాలేస్తోంది.. మంత్రి పొన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఇప్పటికే ఊపందుకుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రహమత్ నగర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం వాడివేడిగా కొనసాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
మంత్రి పొన్నం


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఇప్పటికే ఊపందుకుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రహమత్ నగర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం వాడివేడిగా కొనసాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను తలుచుకుని ఆయన సతీమణి మాగంటి సునీత వేదికపైనే కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే.

ఈ విషయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. తమకు ప్రత్యర్థి, మా సోదరి సునీతను చూసి తాను జాలి పడుతున్నానని అన్నారు. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీల లబ్ధి కోసమే సోదరి సునీతను ఓదార్చతున్నట్లుగా కేటీఆర్, హరీశ్రవు లు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కానీ, రాజకీయాల కోసం సునీతమ్మను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని సెటైర్లు వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ఒకవేళ అభివృద్ధే జరిగి ఉంటే.. బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాలు విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande