కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? రాజాసింగ్ హాట్ కామెట్స్
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాజాగా ఆయన కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను గెలిపిస
రాజాసింగ్


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాజాగా ఆయన కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్ను గెలిపిస్తారా? ఇక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ, మీకు మధ్య కుదిరిన ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారుల వద్ద ముఖం ఎలా చూపుతారో ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, నియోజకవర్గాలతో పాటు డివిజన్లలో వేలుపెట్టే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande