గ్రేటర్ పరిధిలో. తాజాగా మంజూరైన 1.54 తెల్ల రేషన్ కార్డులకు. వచ్చే నెల నుంచి. రేషన్.పంపిణీ
, హైదరాబాద్‌: , 14 అక్టోబర్ (హి.స.) గ్రేటర్‌ పరిధిలో తాజాగా మంజూరైన 1.54 లక్షల తెల్ల రేషన్‌కార్డులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం సహా ఇతర నిత్యావసర సరకులు ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జులైలో మొదటి దశగా కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. త
గ్రేటర్ పరిధిలో. తాజాగా మంజూరైన 1.54 తెల్ల రేషన్ కార్డులకు. వచ్చే నెల నుంచి. రేషన్.పంపిణీ


, హైదరాబాద్‌: , 14 అక్టోబర్ (హి.స.)

గ్రేటర్‌ పరిధిలో తాజాగా మంజూరైన 1.54 లక్షల తెల్ల రేషన్‌కార్డులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం సహా ఇతర నిత్యావసర సరకులు ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జులైలో మొదటి దశగా కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులను మంజూరు చేసింది. నగరవ్యాప్తంగా సుమారు 6 లక్షల దరఖాస్తులు రాగా 1,54,276 కుటుంబాలను అర్హులుగా గుర్తించి కార్డులను జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా 5.77 లక్షల మందికి లబ్ధి కలగనుంది. కొత్తగా మంజూరైన కార్డులకు నవంబరు నుంచి రేషన్‌ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కార్డులకు 3,463 టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేశారు. కొత్తగా వచ్చే దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని, తాజాగా మంజూరవుతున్న కార్డుల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande