ఖమ్మం, 14 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో కొత్త కొత్తూరు వద్ద ఉన్న దుర్గాభవాని రైస్ మిల్లులో మంగళవారం పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని అధికారులు కనుగొన్నారు. విశ్వసనీయంగా పౌరసరఫరాల, పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దాదాపుగా 600 క్వింటాళ్ల వరకు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన బియ్యం బ్యాగుల్లో నాలుగు రకాల బియ్యం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. రేషన్ బియ్యాన్ని పాలీస్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు