తెలంగాణ, సంగారెడ్డి. 14 అక్టోబర్ (హి.స.)
ఇక వారంలో మూడు సార్లు సదరం
క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి క్యాంపులో 100 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు. మంగళవారం ఆమె జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్ లో నమోదు చేసి ధ్రువపత్రాలను అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సదరం క్యాంప్ కు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు