సేంద్రియ వ్యవసాయంతోనే ఆరోగ్యం : కలెక్టర్ హైమావతి
తెలంగాణ, సిద్దిపేట. 14 అక్టోబర్ (హి.స.) సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంబించి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు రైతులు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల ప్రొఫెసర్ జయ
సిద్దిపేట జిల్లా కలెక్టర్


తెలంగాణ, సిద్దిపేట. 14 అక్టోబర్ (హి.స.)

సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంబించి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు రైతులు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం తో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారన్నారు. నేల, నీరు, గాలి కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. .

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande