న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)
తప్పిపోయిన పిల్లల కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రతి రాష్ట్రం నోటల్ (Nodal officers) అధికారులను నియమించాలని మంగళవారం ఆదేశించింది. రాష్ట్రాల్లో పిల్లల మిస్సింగ్, అక్రమ రవాణాపై (child trafficking) సుప్రీంకోర్టులో గురియా స్వయంసేవి సంస్థాన్ సంస్థ పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. పిల్లల మిస్సింగ్ కేసులను రియల్ టైమ్ ప్రాతిపదికన పర్యవేక్షించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..