తిరుపతి, 14 అక్టోబర్ (హి.స.)
, :తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవలను ఏ రోజున ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా వివరించింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ