తిరుమల.శ్రీవారి. పరకామణి. చోరీ కేసు సిఐడి విచారణ
అమరావతి, 14 అక్టోబర్ (హి.స.) తిరుమల: తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని
తిరుమల.శ్రీవారి. పరకామణి. చోరీ కేసు సిఐడి విచారణ


అమరావతి, 14 అక్టోబర్ (హి.స.)

తిరుమల: తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లోనూ రికార్డులను పరిశీలించారు.

2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. 920 డాలర్లు చోరీ చేస్తూ తితిదే ఉద్యోగి రవికుమార్‌ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై తితిదే పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లోక్‌ అదాలత్‌తో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేయించదని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ ప్రారంభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande