సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.. మహేష్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స
మహేష్ కుమార్ గౌడ్


న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను మంగళవారం కోర్టు రిజిస్ట్రార్ దగ్గర ప్రభుత్వ న్యాయవాదులు మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బయట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ విచారణ గురువారం ఉండే అవకాశం ఉంది.. 40 పేజీలతో పిటిషన్ వేశామని అన్నారు. బీసీల జీవితాలు బాగుపడాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు అడుగడుగునా బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుపడుతూ.. వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande