తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
తిరుపతి, 14 అక్టోబర్ (హి.స.)తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపి
/andhra-pradesh/chittoor/tiruchanoor-padmavathi-ammavari-brahmotsavams-2025-full-dates-


తిరుపతి, 14 అక్టోబర్ (హి.స.)తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవలను ఏ రోజున ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా వివరించింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వాహన సేవల వివరాలు :

17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం (ధనుర్ లగ్నం) ఉదయం, చిన్నశేషవాహనం ( రాత్రి).

18-11-2025 (మంగళవారం) పెద్ద శేషవాహనం (ఉదయం), హంసవాహనం (రాత్రి).

19-11-2025 (బుధవారం) ముత్యపు పందిరి వాహనం (ఉదయం), సింహవాహనం (రాత్రి)

20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం (ఉదయం), హనుమంత వాహనం (రాత్రి)

21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం (ఉదయం), గజవాహనం (రాత్రి)

22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గరుడవాహనం (రాత్రి)

23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం (ఉదయం), చంద్రప్రభ వాహనం (రాత్రి)

24-11-2025 (సోమవారం) రథోత్సవం (ఉదయం), అశ్వ వాహనం (రాత్రి)

25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి).

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande