అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో 190 కొత్త 108 వాహనాలను త్వరలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు అవకాశం ఏర్పడుతుందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో డొక్కు, తుక్కుగా తయారై, తరచూ మరమ్మతులకు గురవుతున్న అంబులెన్స్‌లను తొలగించి, వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు నడుపుతామని తెలిపారు. తద్వారా గోల్డెన్ అవర్‌లోనే క్షతగాత్రులు ఆస్పత్రులకు చేరుకుని వైద్యం పొందుతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 650 అంబులెన్స్‌లు నడుస్తున్నాయని, పాత వాటిని తొలగిస్తే కొత్త వాటితో కలిపి వాహనాల సంఖ్య 731కు చేరుకుందని వివరించారు. గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో అంబులెన్స్‌లు ఉండేవని, కొత్త అంబులెన్స్‌లు జాతీయ అంబులెన్స్ కోడ్ ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ