గూగుల్ తో ఏపి.ప్రభుత్వం.ఒప్పందం చారిత్మకమని మంత్రి పార్థసారధి అన్నారు
అమరావతి, 15 అక్టోబర్ (హి.స.) అమరావతి: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చరిత్రాత్మకమని మంత్రి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ఆరంభమైందని చెప్పారు. ఏపీలో డేటా సెంటర్‌ రావడం యువతకు ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. ఇది యువనేత, మంత్రి లోకేశ్‌ అకుం
గూగుల్ తో ఏపి.ప్రభుత్వం.ఒప్పందం చారిత్మకమని మంత్రి పార్థసారధి అన్నారు


అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)

అమరావతి: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చరిత్రాత్మకమని మంత్రి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ఆరంభమైందని చెప్పారు. ఏపీలో డేటా సెంటర్‌ రావడం యువతకు ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. ఇది యువనేత, మంత్రి లోకేశ్‌ అకుంఠిత దీక్షకు నిదర్శనమని వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లోకేశ్ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం యువత కలలు నిజం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande