పులులు ఉన్నాయి.. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లొద్దు. డి ఎఫ్ ఓ నీరజ్ కుమార్
ఆసిఫాబాద్, 15 అక్టోబర్ (హి.స.) కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని.. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకూడదని డీఎఫ్ నీరజ్ కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా
ఆసిఫాబాద్


ఆసిఫాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని.. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకూడదని డీఎఫ్ నీరజ్ కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిర్యాణీ, బెల్లంపల్లి సరిహద్దు ప్రాంతాలతో పాటు సిర్పూర్ టి నియోజకవర్గంలోని ఇట్యాల పహాడ్ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉందని.. ఖనర్గాం, రెబ్బెన, పెంచి కల్ పేట్, వేంపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్టు తెలిపారు. పనులు అటవీ ప్రాంతంలోని పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవ్వరు కుడా అనవసరంగా అటవీ ప్రాంతంలో వెళ్లొద్దని హెచ్చరించారు. పశువుల కాపరిలతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నాలుగు గంటలలోపు ముగించుకుని _ ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే చిరుతపులి, ఎలుగుబంటి దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande