యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.)
నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వారు భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని వంకమామిడి గ్రామానికి చెందిన జింక బాలమ్మ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయల ఎల్బీసీ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు