నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
హనుమకొండ, 15 అక్టోబర్ (హి.స.) నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే తల్లి చిత్రపటానికి నివాళులర్పించ
సీఎం రేవంత్ రెడ్డి


హనుమకొండ, 15 అక్టోబర్ (హి.స.)

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుటుంబ సీఎం సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించడంతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, యశాశ్విని రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, రఘువీరరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande