యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.)
శాస్త్రీయ విధానంలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల పరిధిలోని ట్రిపుల్ ఆర్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులను కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములను సేకరించి రైతులకు న్యాయం చేకూర్చిందని అదే తరహాలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఒక నిర్దిష్ట వ్యాసార్థంలో శాస్త్రీయ పద్ధతిలోనే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు