ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వాడకంపై ఈసీ ఫోకస్.
బీహార్, 15 అక్టోబర్ (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో డబ్బు శక్తి, ఉచిత బహుమతులు, డ్రగ్స్, మాద
ఎన్నికల సంఘం


బీహార్, 15 అక్టోబర్ (హి.స.)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో డబ్బు శక్తి, ఉచిత బహుమతులు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యం వాడకాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అన్ని చట్ట అమలు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసే వ్యయాలను పర్యవేక్షించేందుకు ఖర్చు పరిశీలకులను ఇప్పటికే నియమించారు.

కాగా ఇప్పటికే వారంతా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజునే ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, వీరు తమ సందర్శనలో ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బృందాలతో సమావేశమవుతారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వైలెన్స్ బృందాలు, వీడియో పర్యవేక్షణ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ, ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు లేదా ఇతర ప్రలోభాలు వినియోగించే ప్రయత్నాలను కట్టడి చేస్తాయని తెలిపింది. ఇప్పటికే వివిధ సంస్థలు ₹33.97 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులను స్వాధీనం చేసుకున్నాయి అని ఎన్నికల సంఘం వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande