ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిషితంగా పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 6.30 నిమిష
ఎగ్జిట్ పోల్స్


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిషితంగా పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ నిషేధం అన్ని రకాల పేపర్లు, టీవీలు, రెడియే, పత్రికలు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు, ప్రచార మాద్యమాలకు వర్తిస్తుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అలాగే ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండు విదించే అవకాశం ఉన్నట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ నవంబర్ 11న జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande