అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)
మంగళగిరి: గత ప్రభుత్వం బుల్‌డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే.. ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి వాడుతోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టాటా గ్రూప్‌నకు చెందిన హిటాచీ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘‘బుల్‌డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనులు కూడా చేయవచ్చని నిరూపించే ప్రభుత్వమిది. ఓడిన చోట గెలవాలనే ఉద్దేశంతోనే.. ఎందరు చెప్పినా మంగళగిరిని వీడలేదు. ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి చెందిన పని అంటే కాదనే వారు లేరు. ప్రజలకు నాకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించాం. టాటా హిటాచీతో పాటు ఇతర అనుబంధ సంస్థల్ని లక్ష్మీ గ్రూప్ ఇక్కడ ఏర్పాటు చేయాలి’’అని లోకేశ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ