హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ షాక్.. మరో కేసు నమోదు
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను ఉపయోగించారని ఆరోపణలు రావడంతో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
హెచ్సీఏ


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్

(HCA)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను ఉపయోగించారని ఆరోపణలు రావడంతో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒక ఆటగాడికి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి? అని కరీంనగర్ కు చెందిన అనంత రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఇవే సర్టిఫికెట్లను నకిలీగా తెచ్చినప్పటికీ మళ్లీ అదే ఆటగాళ్లను ఎంపిక చేయడం బాధాకరమని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా తప్పుడు బర్త్ సర్టిఫికెట్లతో 52 మందిని క్రికెట్ ఆడించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ హబీబ్ అహ్మద్, సభ్యులు సందీప్ రాజన్, సందీప్ త్యాగ్ పేర్లు ఉన్నాయి. ఇద్దరు ప్లేయర్స్ నుంచి సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు డిమాండ్ చేసినట్లు తాజా ఫిర్యాదులో తెలిపారు. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచులలో క్కువ వయసున్న ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్లో ఎంట్రీ ఇస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంత మంది తాజాగా HCA ప్లేయర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande