రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.. భూపాలపల్లి కలెక్టర్
భూపాలపల్లి, 15 అక్టోబర్ (హి.స.) వరి పంట పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార, డిఆర్డిఓ మార్కెటింగ్, వ్యవసాయ,
భూపాలపల్లి కలెక్టర్


భూపాలపల్లి, 15 అక్టోబర్ (హి.స.)

వరి పంట పండించిన రైతులకు

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార, డిఆర్డిఓ మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు కొలతలు శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చాలా కీలకమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి మన జిల్లాలో కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన పరికరాలు కొరకు ముందుగానే ఇండెన్ట్ ఇవ్వాలని సూచించారు.

రవాణాలో సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande