హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు రేస్లో పలువురు నేతల పేర్లు వినిపించాయి. జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అనే పేరుంది. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయింది.
కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునిత బరిలో ఉన్నారు. కాగా బీజేపీలో తనకు టికెట్ ఖాయం అని జూటూరు కీర్తిరెడ్డి భావించారు. కానీ అధిష్టానం ఆమెకు షాకిచ్చినటైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు