జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసుల తనిఖీలు.. భారీగా మద్యం పట్టివేత
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ఓటర్లను డబ్బు, మద్యంతో మభ్యపెట్టే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సి
మద్యం పట్టివేత


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ఓటర్లను డబ్బు, మద్యంతో మభ్యపెట్టే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది కలిసి బోరబండలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అయితే, ఇద్దరు మహిళలు సంచుల్లో మద్యం సీసాలు పెట్టి అమ్మకాలు కొనసాగిస్తుండగా వారిని రెడ్యోండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 173 మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులు ఈశ్వరమ్మ, మరియాలను కేసు నమోదు చేసి అమీర్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande