జూబ్లీహిల్స్ ఎలక్షన్స్.. బీఆర్ఎస్లో 200 మంది కీలక నేతలు చేరిక
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి. లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది బీజేపీకి
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి. లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో గోపీనాథ్ ఐదు సంవత్సరాల కోసం గెలిచారు. దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పెళ్లికాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గోపీనాథ్ సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దుర్మార్గం. కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande