అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదాయకం: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తెలంగాణ, 15 అక్టోబర్ (హి.స.) అత్యంత సామాన్య కుటుంబం నుంచి జీవితాన్ని ప్రారంభించి.. భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్సైల్ మెన్గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమ
ఎమ్మెల్యే గూడెం


తెలంగాణ, 15 అక్టోబర్ (హి.స.) అత్యంత సామాన్య కుటుంబం

నుంచి జీవితాన్ని ప్రారంభించి.. భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్సైల్ మెన్గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని, డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande