స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, 15 అక్టోబర్ (హి.స.) రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గ
మంత్రి పొన్నం


హుస్నాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో జరిగిన నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాతోలే, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలనే కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పదవులు బలంగా ఉండాలంటే పార్టీ బలోపేతానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పదవుల్లో ఉండడం గొప్ప కాదని, కాంగ్రెస్ పదవుల్లో ఉన్న లీడర్ తమ బూతులో గెలవాలని, అప్పుడే ఆ లీడర్ యొక్క బలం నిరూపణ అవుతుందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపాలని కార్యకర్తలకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande