నాగర్ కర్నూల్, 15 అక్టోబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లాలో వానకాలం
వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం షామియానా, తాగునీరు, విద్యుత్ వసతి, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకత పాటించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోళ్లు జరగాలన్నారు. తేమ శాతం 17 లోపు ఉంచి ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..