జూబ్లీహిల్స్ దొంగఓట్లు మీ పనే .. కేటీఆర్ కు అర్వింద్ కౌంటర్ ..
నిజామాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సింపతి రాజకీయాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బై ఎలక్షన్స్ లో సింపతి అని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్స్, పబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నుల్లో నడ
ఎంపీ అరవింద్


నిజామాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సింపతి రాజకీయాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బై ఎలక్షన్స్ లో సింపతి అని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్స్, పబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నుల్లో నడిచింది? ఆ లోకల్ నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సింపతి చూపాల్సింది ఎవరికి డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్లకా? లేక డ్రగ్స్ బాధితులకా అని ప్రశ్నిచారు. డ్రగ్స్ కేసుల్లో దొరికిన సెలబ్రెటీలను కేటీఆర్ విడిపించలేదా అని ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన అర్వింద్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో దొంగఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని అర్వింద్ ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande